: తిరుమ‌ల కొండ‌పై అప‌చారం వ‌ద్దు.. ‘నో ఫ్ల‌యింగ్ జోన్’ నిర్ణ‌యంపై శ్రీ‌వారి భక్తుల ఆందోళ‌న‌


తిరుమల ఏడుకొండలపై నో ఫ్లయింగ్‌ జోన్ విస్తరించే అవకాశం లేదని నిన్న కేంద్రం తేల్చిచెప్పిన అంశంపై శ్రీ‌వారి భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నో ఫ్లయింగ్‌ జోన్ కారణంగా అనేక ఇబ్బందులు ఉన్నాయంటూ కేంద్రం పేర్కొన్న విష‌యం తెలిసిందే. రాష్ట్రపతిభవన్‌, అణువిద్యుత్‌ కేంద్రాలపై తప్ప ఎక్కడా నో ఫ్లయింగ్‌ జోన్‌ ప్రకటించలేమని కేంద్రం స్పష్టం చేసిన నేప‌థ్యంలో.. ఈరోజు తిరుమ‌ల‌లో నో ఫ్ల‌యింగ్ జోన్ కోసం భ‌క్తులు ఆందోళ‌న‌కు దిగారు. పీఠాధిప‌తులు దీనిపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంద‌ని భక్తులు అంటున్నారు. దీనిపై మౌనం పాటించొద్దని వారు అంటున్నారు. కొండపై నుంచి విమానాలు ప్రయాణించడం అపచారమని వెంకన్న భక్తులు అంటున్నారు. ‘ఏ విమానాశ్ర‌యాలు మాకు వ‌ద్దు.. ఆల‌య ప‌విత్ర‌తే ముఖ్యం’ అని భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీని వ‌ల్ల భ‌విష్య‌త్తులో దేశానికి, రాష్ట్రానికి పెద్ద ఎత్తున ముప్పు పొంచి ఉంటుంద‌ని, ఆగ‌మ శాస్త్రానికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్ద‌ని వారు అంటున్నారు. ‘అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వ‌ద్దు.. వెంక‌న్న సేవే ముద్దు’ అని ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News