: ఓ మహిళను 'డియర్' అని సంబోధించడం తప్పా?... టైమ్స్ నిర్వహించిన ఆసక్తికర పోల్ సర్వే ఫలితాలు


కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని బీహార్ మంత్రి అశోక్ చౌదరి 'డియర్' అని సంబోధించడంతో ఆమె అభ్యంతరం చెప్పిన సంగతి విదితమే. ఈ వివాదంపై 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ ఆన్ లైన్ పోల్ ను నిర్వహించింది. ఆసక్తికరంగా ఉన్న ఈ సర్వేలో మూడు ప్రశ్నలను అడుగగా, వాటికి నెటిజన్లు ఇచ్చిన సమాధానాలు ఇవి. ఓ మహిళను 'డియర్' అని సంబోధించడం 'సెక్సీయస్ట్ రిమార్క్' అవుతుందా? అని అడుగగా, 82 శాతం మంది కాదని, 18 శాతం మంది అవునని సమాధానం ఇచ్చారు. ఇక కొత్తగా ఎవరైనా మహిళకు లేఖ రాయాలంటే ఏమని సంబోధిస్తే బాగుంటుంది? అన్న ప్రశ్నకు 'హాయ్' అంటే బాగుంటుందని 31 శాతం మంది, 'డియర్' అనాలని 35 శాతం మంది, 'హలో' అనవచ్చని 30 శాతం మంది, 'రస్పెక్టెడ్' అంటే మంచిదని 14 శాతం మంది వెల్లడించారు. ఇక అదే లేఖను ఏమని ముగించాలన్న ప్రశ్నకు, 'యువర్స్ సిన్సియర్లీ / ఫెయిత్ ఫుల్లీ' అనాలని 16 శాతం మంది, 'రిగార్డ్స్' అనాలని 69 శాతం మంది చెప్పగా, 'బెస్ట్' లేదా 'చీర్స్'తో లేఖ ముగించవచ్చని మిగతావారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News