: బెంగళూరు 'కేఫ్ కాఫీ డే'లో ఘోరం... ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు
బెంగళూరులోని కేఫ్ కాఫీ డేలో కాఫీ తాగుతున్న మహేష్ (35) అనే వ్యక్తిని నలుగురు దుండగులు పదునైన కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి 7 గంటలకు విజయనగర్ లో జరిగింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మరణించగా, అతని స్నేహితుడు రక్షిత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహేష్ పై గతంలో పలు కేసులు నమోదైనాయని, కొన్ని కోర్టుల్లో, మరికొన్ని దర్యాప్తు దశలో ఉన్నాయని, వ్యక్తిగత శత్రుత్వమే దాడికి కారణమై ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ దాడి ఘటన దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తం కాగా, వాటి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.