: కబాలి ‘నిరుప్పుడా’ పాట టీజర్ కూడా దుమ్ము దులిపేస్తోంది
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ‘కబాలి’ సినిమా టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలై అత్యధిక హిట్లతో రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. 'రజనీకాంత్ సత్తా ఇదీ' అంటూ ఆ టీజర్ ఆయనకున్న ఇమేజ్ ఏంటో మరోసారి రుజువుచేసింది. అయితే, తాజాగా కబాలిలోని ‘నిరుప్పుడా’ పాట టీజర్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ టీజర్ విడుదలైన ఒక్కరోజులోనే యూట్యూబ్‌లో దానికి 34,17,666 హిట్లు వచ్చాయి. తాజా టీజర్‌లోనూ రజనీకాంత్ లుక్ సరికొత్తగా ఉండడంతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో రజనీకి జంటగా రాధికా ఆప్టే నటిస్తోంది. చిత్ర బృందం ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.