: అచ్చుగుద్దినట్టుండే ఐఫోన్ క్లోన్... రూ. 5,444 కే!


ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో చైనా కంపెనీలు యాపిల్ ఫోన్లను పోలివుండే స్మార్ట్ ఫోన్లను తయారు చేసి అమ్ముతున్నాయి కూడా. తాజాగా, నారత్ కు చెందిన రష్మీ గ్రూప్ సబ్ సైడరీ సంస్థ అల్యూర్ ఐఫోన్ క్లోన్ ను రూ. 5,444కు విడుదల చేసింది. అచ్చుగుద్దినట్టు ఐఫోన్ లా కనిపించే దీనిలో 5.5 అంగుళాల స్క్రీన్, 1.3 జీహెచ్ ప్రాసెసర్, 10/5 ఎంపీ కెమెరాలు 1 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలున్నాయి. ఫోన్ లో మంచి బ్రైట్ నెస్, ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్, సౌండ్ క్వాలిటీ బాగుండగా, కెమెరా పనితీరు అసంతృప్తికరమని, 4జీ లేదని విశ్లేషణలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News