: హైదరాబాద్‌లో స్కూలు బస్సుకి బలైన ఎల్‌కేజీ విద్యార్థి.. స్థానికుల ఆందోళన
హైదరాబాద్ చింతల్ వివేకానందనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూలు వద్ద ఎల్‌కేజీ విద్యార్థి స్కూల్ బస్సుకి బలయ్యాడు. అక్కడి విజ్ఞానసుధా పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ విద్యార్థి జశ్వంత్ ను స్కూల్ బస్ ఢీ కొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తమ ఆరేళ్ల చిన్నారి మరణంతో విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చదువుకోసం స్కూలుకి వెళ్లిన తమ చిన్నారి మృతి చెందడంతో ఆ విద్యార్థి బంధువులు విజ్ఞానసుధా పబ్లిక్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.