: హాకీకి గోల్డెన్ డేస్... తొలిసారిగా చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్


హాకీ క్రీడలో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని చూపి, ఆపై పాతాళానికి పడిపోయిన ఇండియా, తిరిగి సత్తా చాటింది. ఇండియాలో హాకీకి గోల్డెన్ డేస్ తిరిగి వస్తున్నాయన్న సంకేతాలు చూపుతూ, తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత రాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 4-2 తేడాతో ఓటమి పాలైనప్పటికీ, అంతకుముందు లీగ్ పోటీల్లో విజయాల కారణంగా బ్రిటన్ లో జరుగుతున్న 36వ హీరో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ఇండియా అడుగు పెట్టింది. దీంతో ఇండియాకు కనీసం సిల్వర్ మెడల్ ఖాయమైంది. బంగారు పతకం కోసం భారత జట్టు ఫైనల్ పోరును ఆస్ట్రేలియాతోనే ఆడనుండటం గమనార్హం. ఈ మ్యాచ్ నేటి రాత్రి జరగనుంది. 1982లో చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఓడి కాంస్య పతకానికి పరిమితమైన భారత్, ఆపై ఇప్పుడు కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుంది.

  • Loading...

More Telugu News