: కోహ్లీ సెంచరీల రికార్డును బద్దలుకొట్టిన ఆమ్లా!
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గతంలో స్థాపించిన అరుదైన రికార్డును దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా చెరిపేశాడు. గత రాత్రి వెస్టిండీస్ తో జరిగిన వన్డే పోటీలో సెంచరీ కొట్టడం ద్వారా 23 సెంచరీలు చేసిన ఘనతను సాధించాడు. మొత్తం 135 వన్డే మ్యాచ్ లు ఆడిన ఆమ్లా 132 ఇన్నింగ్స్ లో ఈ రికార్డు సాధించాడు. 23 సెంచరీల రికార్డును సచిన్ టెండూల్కర్ 214 ఇన్నింగ్స్ లలో చేయగా, కోహ్లీ దాన్ని 157 వన్డేల్లో చెరిపేశాడు. ఇక ఇప్పుడు ఆమ్లా 132 ఇన్నింగ్స్ లోనే ఆ రికార్డును చేరడం విశేషం.