: భారత్ కు మద్దతివ్వండి!... ఎన్ఎస్జీ సభ్య దేశాలకు అమెరికా పిలుపు
అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేసుకున్న దరఖాస్తుకు మరింత మద్దతు లభించినట్లైంది. ఇప్పటికే తన సంపూర్ణ మద్దతు ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా... భారత దరఖాస్తుకు మద్దతుగా నిలవాలంటూ ఎన్ఎస్జీ సభ్య దేశాలకు తాజాగా లేఖ రాసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఎన్ఎస్జీ సభ్య దేశాలకు లేఖ రాశారు. భారత్ కు ఎన్ఎస్జీలో సభ్యత్వమిస్తే పెను ముప్పు తప్పదని ఓ వైపు చైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నా... అమెరికా మాత్రం భారత్ కు మద్దతిచ్చేందుకే నిర్ణయించుకుంది. ఈ నెల 20 నుంచి దక్షిణ కొరియా రాజధాని సీయోల్ లో ప్రారంభం కానున్న ఎన్ఎస్జీ సమావేశాల్లో భారత్ కు సభ్యత్వంపై కీలక చర్చ జరగనుంది.