: పెరిగిన కీటోన్ బాడీస్ తో క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యం... 9వ రోజుకు ఆమరణ దీక్ష
తుని ఘటనలకు బాధ్యులను చేస్తూ, పోలీసులు అరెస్ట్ చేసిన కాపు వర్గం వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 9వ రోజుకు చేరింది. ఆయన మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగడంతో పరిస్థితి క్షీణిస్తోందని, వైద్యానికి సహకరించని ముద్రగడ, గత రాత్రి ఓ సెలైన్ పెట్టేందుకు మాత్రం అంగీకరించారని ఈ ఉదయం వైద్యులు ప్రకటించారు. ఆయన ఆరోగ్యం విషమిస్తున్నా, దీక్షను విరమించేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు. ఆయన్ను ప్రతి గంటకూ పరీక్షిస్తున్నామని, పల్స్ రేట్ క్రమంగా పడిపోతూ ఉన్నదని తెలిపారు. కీటోన్ బాడీస్ పెరగడం ప్రమాదకరమని ఆయన బంధువులకు వివరించామని, ఆయన్ను దీక్ష విరమించేందుకు ఒప్పించాలని వారి ద్వారా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.