: ఏపీకి ‘హోదా’ హుళక్కే!... నెల్లూరు వికాస్ పర్వ్ లో తేల్చేసిన పారికర్!


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రం పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తాజాగా వికాస్ పర్వ్ పేరిట నిర్వహిస్తున్న సభలో పాలుపంచుకునేందుకు నిన్న నెల్లూరు వచ్చిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ విషయాన్ని మరోమారు తేల్చిచెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం దాదాపుగా సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అయినా ప్రత్యేక హోదా కింద రాష్ట్రానికి అందే సాయం కంటే అధికంగానే నిధులు కేటాయిస్తున్నట్లు పారికర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News