: కేసీఆర్ గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు: విజయశాంతి


గుత్తా, వివేక్, వినోద్ లు పార్టీ మారిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, 'పార్టీ ఫిరాయింపులు దారుణం అంటూ గొంతు చించుకుంటున్న జానారెడ్డి గారూ... గతంలో మీ పార్టీలో విజయశాంతిని చేర్చుకున్నప్పుడు ఈ విలువలు ఏమయ్యాయి?... మీరు చేస్తే సంసారము, మేము చేస్తే వ్యభిచారమా?' అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. కేసీఆర్ గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. తాను టీఆర్ఎస్ లో ఉండగా కాంగ్రెస్ లో చేరలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌ లో ఉండగా కొంత మంది నేతలు చేసిన కుట్రల వల్ల ఆ పార్టీ తనను సస్పెండ్ చేసిన తరువాత, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసైన తరువాత, తాను పార్టీ మారానని ఆమె గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News