: మా ఆవిడ ఎలాగూ రాదు... కనీసం పిల్లలను కూడా తీసుకెళ్లలేదు: వెంకయ్యనాయుడు


రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా చాలా మంది వస్తామని తనను అడిగారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ, 'ఎందుకయ్యా! నేనేమన్నా తొలిసారి రాజ్యసభకు వెళ్తున్నానా?' అని వారిని వారించానని అన్నారు. తన భార్య ఎలాగూ రాదు, ఆమెకి రాజకీయాలంటే ఆసక్తి ఉండదు. కనీసం పిల్లలను కూడా అప్పుడు తీసుకెళ్లలేదని అన్నారు. అదే సమయంలో చంద్రబాబు సహకారంతో తాను రాజ్యసభ సీటు సంపాదిస్తానని పలువురు మీడియాలో రాశారని, దానిని చూసి నవ్వుకున్నానని ఆయన చెప్పారు. ప్రత్యక్షరాజకీయాల్లో ఇంతవరకు తాను పాల్గోలేదని కూడా పనిలో పనిగా రాసేశారని ఆయన నవ్వుతూ చెప్పారు. ఇప్పుడు పేపర్లలో రాసినవారంతా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో అద్భుత విజయం సాధించినప్పుడు పుట్టలేదని వెంకయ్య చమత్కరించారు. నెల్లూరులో ఎన్టీఆర్ ప్రభంజనంతో ప్రతిపక్షనేతలు విజయం సాధించడానికి నానా తంటాలు పడుతుంటే, తానొక్కడినే విజయం సాధించానని, ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడని గతాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలు కొత్త కాదని, పరోక్ష రాజకీయాలు కూడా కొత్త కాదని ఆయన చెప్పారు. తాను ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన వాడినని ఆయన గుర్తు చేశారు. అలాంటి తాను వేరే పార్టీకి చెందిన వ్యక్తుల సహకారంతో రాజ్యసభలో అడుగుపెడతానా? అని ప్రశ్నించారు. తాను బీజేపీ కోసం అహర్నిశలు ఎలా కష్టపడ్డానో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. అలాగే పోరాటం కూడా తనకు కొత్త కాదని ఆయన చెప్పారు. ఇదే విజయవాడలో ఎమర్జెన్సీ సమయంలో ఒకసారి, జై ఆంధ్ర ఉద్యమం సమయంలో ఒకసారి అరెస్టయ్యానని ఆయన తెలిపారు. ఇప్పుడంటే చంద్రబాబు హైదరాబాదును డెవలెప్ చేయడం వల్ల అది పెద్ద నగరం అయింది కానీ, అంతకు ముందు ఏపీ రాజకీయాలు, వ్యాపారం, సినిమాలు ఇలా అన్ని రంగాలూ విజయవాడలోనే ఉండేవని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News