: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హార్దిక్ పటేల్ ఫ్యామిలీ గృహ నిర్బంధం
పటేల్ పట్వారీ రిజర్వేషన్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ స్వగ్రామంలో ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ పర్యటన సందర్భంగా ఆయన కుటుంబానికి గృహ నిర్బంధం విధించారు. రిజర్వేషన్ల పేరుతో ఆయన ఉద్యమం తారస్థాయికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జరిగిన అల్లర్లలో విధ్వంసంపై ఆయన ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో హార్దిక్ కుటుంబం ప్రశ్నలు సంధించి, నిరసన తెలిపే అవకాశం ఉండడంతో వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనలో ఏడుగురు మహిళలు నిరసన తెలపడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.