: అలిపిరిలో కోటి, నెల్లూరులో 40 లక్షలు, హైదరాబాదు 1.3 కోట్లు...దొంగ బాబా లీలలే లీలలు!


లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డికి కుచ్చుటోపీ పెట్టిన ఘటనలో జరుగుతున్న విచారణ సందర్భంగా సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘరానా మోసగాడైన శివానంద బాబా అసలు పేరు బుడ్డప్పగారి శివ అని పోలీసులు గుర్తించారు. ఈ శివ గతంలో తిరుపతిలోని అలిపిరిలో పూజల పేరుతో బాగా డబ్బున్న దంపతులను నిలువు దోపిడీ చేసి, కోటి రూపాయలతో ఉడాయించాడని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరులోని ఆనంద్ రెడ్డి అనే వ్యక్తిని పూజల పేరుతో మోసం చేసి, అతని నుంచి 40 లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించాడని పోలీసులు చెప్పారు. తాజాగా హైదరాబాదులోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డి నుంచి కోటీ 30 లక్షల రూపాయలు దోచుకెళ్లిపోయాడు. పూజలను నమ్మే, బాగా డబ్బున్న వాళ్లే ఈ దొంగ బాబా టార్గెట్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

  • Loading...

More Telugu News