: పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని ఎలా అస్థిర పరుస్తారు..?: కేసీఆర్ వ్యాఖ్యలపై చిన్నారెడ్డి పైర్
కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి నేతలను చేర్చుకుంటోన్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండడం కోసమే తాము కాంగ్రెస్ నేతలని టీఆర్ఎస్ లోకి చేర్చుకుంటున్నామని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడమేటని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మెజార్టీతోనే ఉందని, కేసీఆర్ మతిస్థిమితం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.