: 'లైఫ్ స్టైల్' యజమాని ఇంటి నుంచి బురిడీ బాబా ఆ డబ్బులు ఎలా దొంగిలించాడంటే...!


లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డిని బురిడీ కొట్టించిన వ్యవహారంపై వాస్తవాన్ని పోలీసులు వెలికి తీశారు. బురిడీ బాబా మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూజలు నిర్వహించాడు. అనంతరం కోటీ 30 లక్షల రూపాయల డబ్బు మూటను పూజలు నిర్వహించాలన్న నెపంతో మధుసూధన్ రెడ్డి కుమారుడు సందేశ్ రెడ్డితో కలిసి వివిధ దేవాలయాలకు తీసుకెళ్లాడు. అప్పటికే పూజలు ముగియగానే బురిడీ బాబా ఇచ్చిన ప్రసాదం పని చేయడం ప్రారంభించింది. ఇంతలో బంజారాహిల్స్ లో తాను బస చేసిన హోటల్ కు సందేశ్ ను తీసుకెళ్లాడు. అక్కడ సందేశ్ రెడ్డి కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో విశ్రాంతి తీసుకోవాలని మాయమాటలు చెప్పాడు. ఆయన అపస్మారక స్థితిలో ఉండగా, అతని నుంచి కారు కీస్ దొంగిలించి, కారులో ఉన్న డబ్బు మూటతో ఉడాయించాడు. తరువాత కాసేపటికి సందేశ్ రెడ్డి తేరుకుని ఇంటికి వెళ్లి చూసేసరికి తల్లిదండ్రులు కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వారిని ఆసుపత్రిలో చేర్పించిన సందేశ్ రెడ్డి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News