: ల‌క్ష కుటుంబాల్లో వెలుగు నింపి కొత్త రికార్డు సృష్టించాం: కేసీఆర్


దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. పేద యువ‌తుల‌కు త‌మ ప్ర‌భుత్వం అండ‌గా నిల‌బ‌డుతోంద‌ని వ్యాఖ్యానించారు. క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల ద్వారా ల‌క్ష కుటుంబాల్లో వెలుగు నింపి కొత్త రికార్డు సృష్టించామ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు 44,351 మంది ఎస్సీ, 25,793 మంది ఎస్టీ, 33,913 మంది మైనార్టీ యువ‌తులు ఈ ప‌థ‌కాల ద్వారా లబ్ధి పొందార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప‌థ‌కం ద్వారా మొత్తం 1,04,057 మంది ల‌బ్ధి పొందార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కానికి రూ.530 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News