: సల్మాన్ ఖాన్ ను అభిమానులు ఇమేజ్ చట్రంలో కూర్చోబెట్టేశారు: సుల్తాన్ దర్శకుడు


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను అభిమానులు ఒక ఇమేజ్ చట్రంలో ఇరికించేశారని 'సుల్తాన్' చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ పేర్కొన్నాడు. ముంబైలో సుల్తాన్ ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా అలీ జాఫర్ మాట్లాడుతూ, సల్మాన్ లో అంతులేని ప్రతిభ దాగుందని అన్నాడు. 'గూండే' సినిమా చేస్తున్నప్పుడు కథ చెప్పమన్నాడని, అలా వినిపించినదే సుల్తాన్ అని జాఫర్ తెలిపాడు. సల్మాన్ కొంచెం నటిస్తే చాలు, ఎంతో నటించాడనిపిస్తుందని ఆయన చెప్పాడు. ఇలా నటించాలంటూ సన్నివేశాన్ని వివరించగానే, సల్మాన్ అలా అద్భుతంగా నటించేసేవాడని జాఫర్ కితాబునిచ్చాడు. సల్మాన్ కేవలం మెదడుకు మాత్రమే పని చెప్పడని, భావోద్వేగాలను అద్భుతంగా పండిస్తాడని ఆయన తెలిపాడు.

  • Loading...

More Telugu News