: 'లైఫ్ స్టైల్' యజమాని మధుసూదన్ రెడ్డిని పరామర్శించిన గుత్తా


1.30 కోట్ల రూపాయల మోసానికి గురైన లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంధువు కావడంతో ఆయనను కలిసేందుకు వచ్చానని అన్నారు. ఈ సంఘటన గురించి ఆయనతో ఏమీ మాట్లాడలేదని ఆయన చెప్పారు. ఇలాంటప్పుడు దొంగతనం ఎలా జరిగిందని ఎలా అడుగుతామని ఆయన ప్రశ్నించారు. అలాంటివి పోలీసులు అడుగుతారని, తన పనికాదని అన్నారు. బంధువులు కోలుకోవడమే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News