: తుని ఘటనలో నిందితుల బెయిల్ పిటిషన్... బాబు సర్కారు సహకరిస్తేనే మంజూరుకు చాన్స్!


కాపు ఉద్యమం సందర్భంగా తునిలో జరిగిన రైలు దహనం, పోలీసు స్టేషన్, వాహనాల విధ్వంసం కేసులో అరెస్టయిన నిందితులు నేడు పిఠాపురం అదనపు జిల్లా కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో నిందితులకు బెయిల్ రావాలంటే, ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా కేసులో బెయిల్ పిటిషన్ వస్తే, వారికి బెయిల్ ఇవ్వచ్చా? అని కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ప్రశ్నిస్తుంది. ఆ సమయంలో పీపీ ఇచ్చే సమాధానమే కీలకం. ఇక ఈ కేసులో నిందితులను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు రైల్వే పోలీసుల చేతుల్లోనూ ఉంది. ఈ నేపథ్యంలో వారిని విడుదల చేయాలంటే, ప్రభుత్వం ఓ మెట్టు దిగి, బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కోర్టుకు చెప్పాల్సి వుంటుంది. కాపు నేత ముద్రగడ ఆమరణ దీక్ష నేపథ్యంలో వీరి బెయిల్ పిటిషన్ ఏమవుతుందన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News