: కేసీఆర్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించాలి: రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపేసి రాష్ట్రపతి పాలన పెట్టించాలని టీడీపీ, తెలంగాణ కాంగ్రెస్ కుట్రపన్నాయని, ఈ విషయాన్ని తనకు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారని నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలుంటే వాటి పరిష్కారం దిశగా కేసీఆర్ ఎందుకు చర్చలు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను ప్రజలు ప్రశ్నించే సమయం దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు.