: ఇంటర్నేషనల్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్ గా భారతీ ఎంటర్ ప్రైజస్ సునీల్ మిట్టల్


ఇంటర్నేషనల్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) ఛైర్మన్‌ గా భారతి ఎంటర్‌ ప్రైజెస్‌ వ్యవస్థాపక చైర్మన్ సునీల్‌ మిట్టల్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న ఎస్అండ్ పీ గ్లోబల్ టెర్రీ మెక్ గ్రా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇకపై మెక్ గ్రా ఐసీసీకి గౌరవ చైర్మన్ గా వ్యవహరిస్తారని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, దాదాపు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఐసీసీకి ఛైర్మన్‌ గా ఎన్నికైన మూడవ భారతీయుడు సునీల్ మిట్టల్‌ కావడం గమనార్హం. తనకు లభించిన పదవిపై స్పందించిన మిట్టల్, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ, ఐసీసీ ఎంతో కీలక పాత్రను పోషించాల్సి వుంది, సమ్మిళిత వృద్ధికి నావంతు సహకారాన్ని అందిస్తా" అని అన్నారు. 130 దేశాలు దేశాలకు చెందిన 65 లక్షల మంది సభ్యులుగా ఉన్న ఐసీసీకి 51వ చైర్మన్ సునీల్ మిట్టల్. ప్రస్తుతం మిట్టల్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ టెలీకమ్యూనికేషన్‌ స్టీరింగ్‌ కమిటీకి ఛైర్మన్‌ గా, ఇండియా - అమెరికా, ఇండియా -బ్రిటన్, ఇండియా - జపాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫోరంలలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

  • Loading...

More Telugu News