: శ్వేతసౌధంలో ఒబామాను కలిసిన బౌద్ధ మతగురువు దలైలామా
బౌద్ధ మతగురువు దలైలామా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమయిన శ్వేతసౌధంలో బరాక్ ఒబామాను కలిసి, పలు అంశాలపై చర్చించారు. దలైలామాను ఒబామా వ్యక్తిగతంగానే కలుసుకున్నారని వారిద్దరి మధ్య మానవ హక్కులు, వాతావరణ మార్పులపై చర్చ జరిగిందని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. దలైలామా చేస్తోన్న బోధనల పట్ల ఒబామా ఆయనను ప్రశంసించారని తెలిపారు. టిబెట్‌కి చైనాతో ఉన్న సమస్యలపై తాము జోక్యం చేసుకోలేమని చైనాతో శాంతి యుతంగా చర్చలు జరిపి తమ సమస్యను పరిష్కరించుకోవాలని ఒబామా ఈ సందర్భంగా దలైలామాతో చెప్పినట్లు శ్వేత సౌధం అధికారులు చెప్పారు. అయితే దలైలామా శ్వేతసౌదంలో ఒబామాను కలవడం పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.