: హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన యువతి.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన దుండగులు
హైదరాబాద్‌లో ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోన్న అర్చన అనే యువతి కిడ్నాప్‌కు గురైంది. నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో అర్చన(22)ను బైక్ పై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లారు. అక్కడి దుర్గానగర్ కాలనీలో కిరాణా షాప్‌లో సరుకులు కొనేందుకు వెళ్లిన అర్చనను గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. తమ కూతురు కిడ్నాప్‌కు గురైన ఘటనపై అర్చన తండ్రి వినోద్ దూబే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు.