: చంద్రబాబు సొంత జిల్లా నేతకే బీజేపీ ఏపీ పగ్గాలు!


బీజేపీ ఏపీ శాఖకు అధ్యక్షుడిగా కొనసాగుతున్న విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును ఆ పదవి నుంచి తప్పించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. నిర్ణీత పదవీ కాలం ముగిసిన క్రమంలోనే ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు సమాచారం. ఇక హరిబాబు ఖాళీ చేయనున్న బీజేపీ ఏపీ అధ్యక్షుడెవరనే విషయంపై చాలా కాలం చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పుడూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతలకు ఏపీ పగ్గాలు అప్పగిస్తున్నారని వాదిస్తున్న రాయలసీమ నేతలు... ఈ దఫా తమ ప్రాంతానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండును పరిశీలించిన పార్టీ జాతీయ నాయకత్వం అందుకు సరితూగే నేత రాయలసీమలో ఎవరున్నారని పరిశీలించింది. తొలుత పలు పేర్లు వినిపించినా... తన మిత్రపక్షం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన నేతలకు ఈ పగ్గాలిస్తే బాగుంటుందని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన చల్లపల్లె నరసింహారెడ్డిని పార్టీ ఏపీ అధ్యక్షుడిగా జాతీయ నాయకత్వం ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే చల్లపల్లెను అధ్యక్షుడిగా ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News