: ఇక కరీంనగర్ కూ ‘స్మార్ట్’ హోదా!... కేసీఆర్ అభ్యర్థనకు కేంద్రం సానుకూలం!


తెలంగాణ సర్కారు పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి క్రమంగా మారుతోంది. స్మార్ట్ సిటీ జాబితాలో తెలంగాణ నుంచి ఆశించిన మేర నగరాలను చేర్చలేదన్న వాదనతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఇప్పటికే ఆశించిన మేర అభివృద్ధి నమోదైన హైదరాబాదును జాబితా నుంచి తప్పించి ఆ స్థానంలో కరీంనగర్ ను చేర్చాలని ఆ లేఖలో కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. కేసీఆర్ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్రం అందుకు సమ్మతించింది. జాబితా నుంచి హైదరాబాదును తొలగించి ఆ స్థానంలో కరీంనగర్ ను చేర్చింది. ఇక తదుపరి స్మార్ట్ సిటీల ఎంపికలో హైదరాబాదు స్థానంలో కరీంనగర్ పోటీలోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర మార్పు చేసిన విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో వెల్లడించారు.

  • Loading...

More Telugu News