: టాప్ నక్సల్స్ జంట చలపతి, అరుణలను కష్టాల్లోకి నెట్టిన సెల్ఫీ క్రేజ్


ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దొరక్కుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న టాప్ నక్సల్ చలపతి అలియాస్ అప్పారావు ఎలా ఉంటాడో పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకో తెలుసా? ఆయన తన భార్య, మరో టాప్ నక్సల్, కోరాపుట్ - శ్రీకాకుళం డివిజన్ డిప్యూటీ కమాండెంట్ అరుణతో కలసి సెల్ఫీ దిగడమే. వీరిద్దరూ సరదాగా దిగిన సెల్ఫీ ఇప్పుడు వారిని కష్టాల్లోకి నెట్టింది. ఇటీవల పోలీసు కాల్పుల్లో మరణించిన ఆజాద్ ల్యాప్ టాప్ ను పోలీసులు తెరచి చూడగా, అందులో ఏజన్సీ ఏరియాలో నక్సల్స్ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలతో పాటు చలపతి, అరుణల సెల్ఫీలు కూడా ఉన్నాయి. కాగా, ఇప్పటివరకూ పోలీసుల వద్ద 20 ఏళ్ల క్రితం చలపతి దిగిన ఒక్క చిత్రం మాత్రమే ఉండగా, తాజాగా ఎలా ఉన్నాడో తెలిసిపోయింది. చలపతి తలపై రూ. 20 లక్షలు, ఆయన భార్య అరుణ తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. అరుణ సోదరుడు ఆజాద్, గత నెల 4న కొయ్యూరు మండల పరిధిలోని మర్రిపాకులు సమీపంలో గ్రేహౌండ్స్ చేతిలో హతమైన సంగతి తెలిసిందే. ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ అధునాతన స్మార్ట్ ఫోన్ నుంచి చలపతి, అరుణలు సెల్ఫీ తీసుకున్నారని, ఇక ఆ జంటను గుర్తించడం సులువేనని వైజాగ్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News