: సల్మాన్ రికార్డ్ బద్దలు.. హృతిక్ రోషన్‌కి రూ.68 కోట్ల భారీ రెమ్యూనరేషన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రికార్డును హృతిక్ రోషన్ బద్దలు కొట్టాడు. బాలీవుడ్‌లో ఇప్పటివరకు రూ.50 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా అగ్రస్థానంలో ఉన్న సల్మాన్ రికార్డును హృతిక్ అధిగమించాడు. సల్మాన్ తీసుకున్న దాని కంటే హృతిక్ ఏకంగా 18కోట్ల అధిక పారితోషికం అందుకుంటున్నాడు. బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘మొహెంజోదారో’లో నటిస్తోన్న హృతిక్ 68 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. దీంతో సల్మాన్ రికార్డును అధిగమించేసి హృతిక్ రెమ్యూనరేషన్‌లో టాప్ ప్లేస్ లోకి వచ్చేశాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘మొహెంజోదారో’ చిత్రంలో హృతిక్ రోషన్ పలు సీన్ల కోసం సాహసాలే చేస్తున్నాడట. భారీ యాక్షన్ సీన్లలో నటిస్తున్నాడట. తన కష్టానికి తగ్గట్లే నిర్మాతల నుంచి హృతిక్ భారీ పారితోషికాన్ని అందుకుంటున్నాడు. యూటీవీ మోషన్ పిక్చర్స్, అశుతోష్ గోరీకర్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్లపై నిర్మాతలు సిద్ధార్థ్ రాయ్ కపూర్, సునీత గోరీకర్, అశుతోష్ గోరీకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని 150 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నారు. చిత్రంలో హృతిక్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మొహెంజోదారో సినిమా ఆగస్టు 12న అభిమానుల ముందుకు రానుంది.