: నరేంద్ర మోదీ ముందు పాక్ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ కోరిక... చిరునవ్వే సమాధానం!


పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలసి తన మనసులోని కోరికను వెలిబుచ్చి, దాన్ని నెరవేర్చాలని కోరగా, ప్రధాని నుంచి చిరునవ్వే సమాధానంగా వచ్చిందట. ఇంతకీ ఆయన ఏం కోరుకున్నారో తెలుసా?... చాలా కాలంగా భారత్, పాక్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరగలేదని, ఇరు దేశాల మధ్యా క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని ఖాన్ కోరగా, మోదీ ఎలాంటి సమాధానమూ చెప్పలేదని, ఈ ఘటన ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 పోటీలు సాగుతున్న వేళ జరిగిందని 'హిందుస్థాన్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని ఖాన్ స్వయంగా వెల్లడిస్తూ, "ఇరు దేశాల మధ్యా టూర్ సాగాలని కోరాను. మోదీతో అది నా తొలి సమావేశం. ఒకవేళ రెండోసారి కలిస్తే, భారత విదేశాంగ విధానం అపరిపక్వంగా ఉందని చెబుతాను" అన్నారు. కాగా, 2007 నుంచి ఇరుదేశాల మధ్యా ఒక్క సిరీస్ కూడా జరగలేదన్న సంగతి తెలిసిందే. (2012/13లో మాత్రం పాక్ జట్టు భారత పర్యటనకు రాగా షార్ట్ సిరీస్ జరిగింది) వరల్డ్ కప్ వంటి ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయే తప్ప ద్వైపాక్షిక పోటీలు, రెండు దేశాల మధ్యా పర్యటనలు మాత్రం నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News