: ప్రపంచం ఆర్థిక మందగమనంలో ఉంది.. భారత్ అభివృద్ధి చెందుతోంది: వెంకయ్య
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎన్డీఏ రెండేళ్ల పాలనపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ గాడిలో పెట్టారని అన్నారు. ప్రపంచం ఆర్థిక మందగమనంలో ఉన్నా భారత్ అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. యూరియా కొరత లేకుండా మోదీ చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు. రెండేళ్లలో యూరియా కొరత లేకుండా చూశామని ఆయన వ్యాఖ్యానించారు. యూరియా అక్రమ రవాణా అరికట్టామని తెలిపారు. ఎంతో మంది ప్రైవేటు డాక్టర్లు ఉన్నా కూడా దేశంలో డాకర్ల కొరత ఉందని ఆయన అన్నారు. అందుకే 65ఏళ్లకు డాక్టర్ల రిటైర్మెంట్ వయసును పెంచినట్లు పేర్కొన్నారు.