: ఉడ్తా పంజాబ్ ఆన్ లైన్ లీక్ లింకుల్లో అత్యంత ప్రమాదకర వైరస్!


విడుదలకు ముందే సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉడ్తా పంజాబ్ చిత్రం నిన్న ఆన్ లైన్ లో లీకైన సంగతి తెలిసిందే. నిర్మాతలు వెంటనే స్పందించి ఆన్ లైన్ నుంచి చిత్రాన్ని తొలగించే చర్యలు చేపట్టినప్పటికీ, అప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న వారు మళ్లీ మళ్లీ అప్ లోడ్ చేస్తున్నారు. అయితే, ఈ అప్ లోడ్ లింకులతో అత్యంత ప్రమాదకర వైరస్ కూడా వ్యాపిస్తోందని, సినిమాను స్మార్ట్ ఫోన్ నుంచి చూడాలని భావిస్తే, ఫోన్ లోని మొత్తం సమాచారం తుడిచిపెట్టుకు పోతోందని పలువురు హెచ్చరించారు. కంప్యూటర్ లో డౌన్ లోడ్ చేసుకున్నా ఇదే పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు తెలిపారు. ఇక పైరసీని వ్యతిరేకిస్తూ, షాహిద్ కపూర్, కరణ్ జోహార్, అర్జున్ కపూర్, బిపాషా బసూ, వరుణ్ ధావన్, సిద్ధార్థ మల్ హోత్రా, సోనాక్షీ సిన్హా తదితరులు ట్వీట్లు చేస్తూ, చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News