: రూపాయికి బియ్యం ఇచ్చే బదులు రుణమాఫీ చేయొచ్చుగా?: చంద్రబాబుకు జేసీ సలహా


ఆంధ్రప్రదేశ్ లో రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకం శుద్ధ దండగని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన మొక్కల పంపకం, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. రూపాయికి బియ్యం ఇచ్చే బదులు దానికి పెట్టే డబ్బుతో రూ. 5 వేల కోట్ల వరకూ రైతు రుణాలను మాఫీ చేసివుండాల్సిందని తనదైన శైలిలో సీఎం చంద్రబాబుకు సలహా ఇచ్చారు. కృష్ణా నీటిని బైరవానితిప్ప ప్రాజెక్టు ద్వారా అనంతపురం తీసుకొచ్చే పనులు ఇప్పట్లో పూర్తి కావని, కనీసం నాలుగేళ్లయినా పడుతుందని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత తీవ్ర నిధుల కొరతలో రాష్టం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News