: పార్టీలో చేరేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు షాకిచ్చిన కేసీఆర్!


తెలంగాణలో అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు విపక్షాలు విలవిల్లాడుతున్నాయి. నిన్న జరిగిన చేరికల్లో టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, జి.వివేక్, జి.వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు నల్లగొండ జిల్లా దేరవకొండ ఎమ్మెల్యేగా ఉన్న సీపీఐ నేత రవీంద్ర నాయక్ కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే చేరికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు భారీ షాకే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి వచ్చిన రవీంద్ర నాయక్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్... ఆ తర్వాత చేసిన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవీంద్ర నాయక్ పార్టీలో చేరుతున్న విషయం తనకు అసలు తెలియదని కేసీఆర్ అనడంతో అక్కడ అందరూ షాకయ్యారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించిన కేసీఆర్ తనకు తెలియకుండానే పార్టీలోకి వచ్చేసిన రవీంద్రనాయక్ చేరిక అద్భుతమని వ్యాఖ్యానించి, వాతావరణాన్ని చల్లబరిచారు.

  • Loading...

More Telugu News