: రాజ్ భవన్ లో కేసీఆర్!... గవర్నర్ తో ఇటీవల చంద్రబాబు భేటీ నేపథ్యంలో కీలక చర్చలు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న మరోమారు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం 6.45 గంటలకు రాజ్ భవన్ లో అడుగుపెట్టిన కేసీఆర్ రాత్రి 8.30 గంటల దాకా అక్కడే గడిపారు. దాదాపు 1.45 గంటల పాటు రాజ్ భవన్ లోనే ఉన్న కేసీఆర్ గవర్నర్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇటీవలే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గవర్నర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న గవర్నర్ తో కేసీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.