: చంద్రబాబుపై కేసీఆర్ ఘాటు విమర్శలు!... సొల్లు కబుర్లు మానుకోవాలని ధ్వజం!
కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తమ పార్టీలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న తెలంగాణ భవన్ వేదికగా సుదీర్ఘ ప్రసంగం చేసిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొల్లు కబుర్లు మానుకోమంటూ ఆయన చంద్రబాబుకు సూచిస్తూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 2019కి ముందే తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చెబుతున్నారని, ఇదేనా ఆయన నీతి అని కేసీఆర్ నిలదీశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఢోకా లేదని, తాము చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో 2019లో కూడా తామే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సొల్లు కబుర్లు మానుకోవాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.