: యువ ఐపీఎస్ శశికుమార్ దుర్మరణం!... ఘటనపై భిన్న వాదనలు!


ఆత్మహత్యాయత్నం చేశారని కొద్దిసేపటి క్రితం వార్తలు వినిపించిన విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ శశికుమార్ చనిపోయారు. సర్వీస్ రివాల్వర్ నుంచి దూసుకువచ్చిన ఓ బుల్లెట్ కారణంగా ఆయన తలకు తీవ్ర గాయమైంది. రక్తపు మడుగులో పడిపోయిన శశికుమార్ ను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే ఆయన ప్రాణాలు విడిచారు. అయితే ఈ ఘటనపై పోలీసు వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన ఇంటిలోనే శశికుమార్ సర్వీస్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకున్నారని ఓ వాదన వినిపిస్తుండగా, చేతిలోని పిస్టల్ ప్రమాదవశాత్తు పేలిన కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని మరో వాదన తెరపైకి వచ్చింది. 2014 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శశికుమార్ ఆరు నెలల క్రితమే పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. కారణం ఏదైనా ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ ఐపీఎస్ అధికారి దుర్మరణం పాలైన ఈ ఘటన పోలీసు వర్గాలను షాక్ కు గురి చేసింది.

  • Loading...

More Telugu News