: ‘హోదా’పై గళం విప్పిన తెలంగాణ!.. ఆర్థిక మంత్రుల భేటీలో ఈటల డిమాండ్!


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్ర అధికార, విపక్షాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఆ రాష్ట్రంలోని అన్ని వర్గాలదీ అదే మాట. అయితే రాష్ట్ర విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ కూడా తాజాగా ప్రత్యేక హోదా డిమాండ్ ను ఎత్తుకుంది. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు నిన్న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో జీఎస్టీ బిల్లుపై జరిగిన ఆర్థిక మంత్రుల భేటీకి హాజరైన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన గళం విప్పారు. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదాను ప్రకటించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో పన్నుల విధానం రాష్ట్రాలకు ఉపయోగపడేలా ఉండాలి గాని, హక్కులను హరించే విధంగా ఉండరాదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News