: 4.01 కోట్ల రూపాయల కారు టైర్లు
దుబాయ్ కి చెందిన జెడ్ టైర్స్ సంస్థ, ఇటలీకి చెందిన ప్రముఖ జ్యుయలర్స్ ఇచ్చిన డిజైన్ తో సరికొత్త కారు టైర్లను తయారు చేసింది. నాలుగు టైర్ల సెట్ ను ఈ సంస్థ రూపొందించింది. ఈ నాలుగు టైర్లు 24 క్యారెట్ల బంగారం పూతతో తయారు చేయగా, వీటిలో ఎంపిక చేసిన వజ్రాలను పొదిగారు. ఈ నాలుగు టైర్ల సెట్ ను దుబాయ్ లో నిర్వహించిన రీఫెన్ ట్రేడ్ ఫెయిర్ లో అమ్మకానికి పెట్టారు. దీంతో ఈ సెట్ ను 6 లక్షల అమెరికన్ డాలర్ల (4.01 కోట్ల రూపాయల) కు అమ్మినట్టు జెడ్ టైర్స్ ప్రకటించింది. దీంతో ఇవి అత్యంత ఖరీదైన కార్ టైర్లుగా గిన్నిస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాయి. కాగా, ఈ 4.01 కోట్ల రూపాయలను జెడ్ టైర్స్ కు చెందిన జెనిసెస్ ఫౌండేషన్ కు విరాళంగా అందజేయనున్నట్టు ఆ సంస్థ తెలిపింది.