: బంజారా హిల్స్ లో దోపిడీ... రూ. 1.30 కోట్ల అపహరణ
హైదరాబాదులోని బంజారాహిల్స్ లో దారుణం చోటుచేసుకుంది. నేటి సాయంత్రం పూజల పేరుతో ఓ ఇంట్లో ప్రవేశించిన నలుగురు దుండగులు, ఆ ఇంట్లో వారిపై మత్తమందు చల్లారు. దాని ప్రభావంతో వారు స్పృహ కోల్పోయారు. వారిలో ఓ వ్యక్తి స్పృహలోకి వచ్చి చూసేసరికి, పరిస్థితి అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఇంతలో ఇంట్లోంచి కోటీ 30 లక్షల రూపాయలు మాయమైనట్టు గుర్తించి లబోదిబోమంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.