: ముద్రగడకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం: విశాఖ రేంజ్ డీఐజీ
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. రాజమండ్రిలో వారు మాట్లాడుతూ, తుని ఘటనలో అరెస్టు అయిన వారికి బెయిల్ ఇప్పించేందుకు ప్రభుత్వం న్యాయనిపుణులను సంప్రదిస్తోందని అన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ముద్రగడతో చర్చలు జరిపామని, అయితే తుని ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారని వారు చెప్పారు. ఐవీ ఫ్లూయిడ్స్ ను బలవంతంగా ఎక్కించలేదని, ఆయన అంగీకారంతోనే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని తెలిపారు. ముద్రగడ ఆత్మహత్యాయత్నం చేయడంతో తాము ఆయనను రక్షించేందుకు తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్చామని అన్నారు. ఆయనను అరెస్టు చేయలేదని ఆయన తెలిపారు.