: రాజీనామా వార్తలను ఖండించిన ఏపీ మంత్రి మాణిక్యాలరావు


మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవాలని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ, రాజీనామా చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్‌ చేశానంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు సొంత నియోజకవర్గంలో తాను లేకుండా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఇలాంటి వార్తలు వెలువడ్డాయని, అయితే అవి అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై తాను టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావుకు ఫిర్యాదు చేశానని, పదవికి రాజీనామా చేయలేదని ఆయన తెలిపారు. ఇదిలా ఉంచితే, స్థానిక టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలతో పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయని వార్తలొస్తున్నాయి.

  • Loading...

More Telugu News