: షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్
టాలీవుడ్ యువనటుడు సందీప్ కిషన్ గాయపడ్డాడు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నక్షత్రం’ సినిమా నిన్ననే సెట్స్ పైకి వెళ్లింది. దీంతో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని మణికొండ దగ్గర జరుగుతోంది. తొలి రోజు ఫైట్ సీన్స్ తో చిత్రీకరణ జరుగుతుండగా, సందీప్ కిషన్ తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అతనిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా, అతనికి కొంత కాలం విశ్రాంతి అవసరమని, చికిత్స జరుగుతోందని వైద్యులు తెలిపారు. దీంతో సినిమా యూనిట్ ఆందోళనలో మునిగిపోయింది. తాజాగా సందీప్ కిషన్ నటించిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.