: నన్ను విమర్శిస్తే పార్టీని అవమానించినట్లే!: రేణుకా చౌదరికి జానారెడ్డి కౌంటర్
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఈరోజు టీపీసీసీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం గరం గరంగా కొనసాగింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరి, సీఎల్పీ లీడర్ జానారెడ్డి మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. తనపై వ్యాఖ్యలు చేస్తోన్న రేణుకాకి ‘మీటింగులకి వచ్చి కబుర్లు చెప్పొద్దని’ జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనను విమర్శిస్తే పార్టీని అవమానించినట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను సరిగ్గా పనిచేయలేదనుకుంటే తప్పుకుంటా’నని ఆయన అన్నారు. సీఎల్పీ లీడర్‌గా జానా పనితీరు బాలేదని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన రెడ్డి కూడా విమర్శించినట్లు తెలుస్తోంది.