: కేఎల్ రాహుల్, ఫజల్ అర్ధ సెంచరీలు...నిలబడ్డ ఓపెనర్లు
జింబాబ్వే పర్యటనతో వన్డేల్లో అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్, ఫజల్ తమ జోరు ప్రదర్శిస్తున్నారు. తొలి వన్డేలో సెంచరీ చేసిన రాహుల్, రెండో వన్డేలో కూడా ఆకట్టుకున్నాడు. మూడో వన్డేలో అర్ధ సెంచరీ సాధించి సత్తాచాటాడు. జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల్లో టీమిండియా ఆకట్టుకుంది. ప్రధానంగా బౌలింగ్ విభాగం ప్రత్యర్థులను కట్టడి చేసి, పెవిలియన్ కు పంపితే...మిగిలిన పనిని ఓపెనర్లు పూర్తి చేశారు. తొలుత ఆచి తూచి ఆడిన వీరిద్దరూ చెత్తబంతులను బౌండరీ లైన్ దాటించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. అరంగేట్రంలోనే ఇద్దరూ ఆకట్టుకునే స్కోర్లు చేయడంతో కెప్టెన్ వీరిని అభినందించాడు. రాహుల్ 58 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా, ఫజల్ 58 బంతుల్లో అర్ధ సెంచరీ మార్కును చేరుకున్నాడు.