: కేరళ కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు
కేరళలోని కొల్లాం డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాగంణంలో బాంబు పేలుడు అలజడి రేపింది. కోర్టు ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర కార్మిక శాఖకు చెందిన జీపు కింద బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని వారు తెలిపారు. బాంబు పేలుడు సమయంలో సాబు అనే వ్యక్తి గాయాలపాలయ్యాడని చెప్పారు. ఓ కేసు గురించి కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన సాబు జీపుకి సమీపంలో నిల్చుని ఉండగా ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. బాంబు పేలుడుతో సాబుకి కళ్లు, ముక్కుపై గాయాలయ్యాయని చెప్పారు. అక్కడి ప్రాంతంలో కలకలం సృష్టించడడానికే దుండగులు ఈ బాంబు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. బాంబు పేలుడు ఘటనలో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.