: ముద్రగడ వైద్య పరీక్షలకు అంగీకరించారు: ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ

కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించారని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ముద్రగడతో తాము, కాపు జేఏసీ నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపామని అన్నారు. అరెస్టైన 17 మందికి బెయిల్, సీబీసీఐడీ విచారణ నిలిపివేతపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తుని ఘటనలో అరెస్టైన వారిని విడుదల చేయాలంటూ గత ఏడు రోజులుగా ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.