: వారూహించినట్టు 'జెంటిల్ మెన్' విజయం సాధించకపోయినా బాధపడను: నాని


తెలుగు సినీ పరిశ్రమలో యువ కథానాయకుడు నానిది ప్రత్యేకశైలి. కథాకథనాలను నమ్ముకుని నాని సినిమాలు చేస్తుంటాడు. ప్రతి సినిమాకి వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. ఈ క్రమంలో పలు వైఫల్యాలు చూసినప్పటికీ, ఇదే అతనిని ఇతర కథానాయకుల నుంచి వేరు చేస్తోంది. 'ఎవడే సుబ్రమణ్యం', 'భలేభలే మగాడివోయ్', 'కృష్ణ గాడి వీరి ప్రేమ గాథ' హిట్లతో మంచి జోరుమీదున్న నాని, తన స్నేహితులు కొంత మంది భారీ బడ్జెట్ సినిమాల్లో నటించాలని ఒత్తిడి తెచ్చారని చెప్పాడు. ఇంకా ప్రయోగాలెందుకు, ఇమేజ్ బేస్డ్ సినిమాలు చేసి మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని వారంతా సూచించారని చెప్పాడు. అందుకు తగ్గట్టే పేరున్న బ్యానర్ల ఆఫర్లు కూడా తీసుకువచ్చారని నాని చెప్పాడు. అయితే తాను మాత్రం నమ్మిన కథతోనే చేస్తానని చెప్పానని తెలిపాడు. 'జెంటిల్మన్' సినిమాలో నటించవద్దని వారు చెప్పినప్పటికీ ధైర్యంగా నటించానని అన్నాడు. వారు చెప్పినట్టు ఈ సినిమా సక్సెస్ కాకపోతే నమ్మిన సినిమాలో నటించాననే సంతోషం తనకు మిగులుతుందని నాని అభిప్రాయపడ్డాడు. నమ్మని కథతో సినిమా చేసి, సంతృప్తి చెందలేనని నాని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News