: ముషారఫ్ కిడ్నాప్ కు తాలిబాన్ల పన్నాగం
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను కిడ్నాప్ చేసేందుకు తాలిబాన్లు ప్రణాళికలు రచిస్తున్నట్టు పాక్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ముషారఫ్ పలు క్రిమినల్ కేసుల్లో తన ఫామ్ హౌస్ లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముషారఫ్ ను విచారణ నిమిత్తం కోర్టుకు తరలించే సమయంలో నిషేధిత తెహ్రీక్-ఏ-తాలిబాన్ ఆయన్ను అపహరించేందుకు యత్నించవచ్చని పాక్ ఇంటలిజెన్స్ సంస్థలు భద్రతా వర్గాలను హెచ్చరించాయి. పాక్ తాలిబాన్లు ముషారఫ్ ను కిడ్నాప్ చేసేందుకు ఇతర జిహాదీ మిలిటెంట్ గ్రూపులతో చేతులు కలిపినట్టు కూడా నిఘా వర్గాలు అంటున్నాయి.
ఇటీవలే స్వీయ బహిష్కరణ ముగించుకుని ముషారఫ్ పాక్ గడ్డపై అడుగుపెట్టిన నేపథ్యంలో.. ఆ మాజీ సైనిక జనరల్ ను తుదముట్టించేందుకు ప్రత్యేక ఆత్మాహుతి దళాన్ని రంగంలోకి దింపామని తెహ్రీక్-ఏ-తాలిబాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.