: కోహ్లీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన ఇమ్రాన్ ఖాన్


అద్భుత ఫాంతో చెల‌రేగి ఆడుతోన్న టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. స‌చిన్ టెండూల్క‌ర్ కంటే కోహ్లీ కొన్ని అంశాల్లో మెరుగని ఆయ‌న అన్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్, బ్రయాన్ లారా అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించేవారని తనకు మాత్రం కోహ్లీ వాళ్లందరికన్నా పరిపూర్ణమైన బ్యాట్స్‌మెన్‌లా క‌నిపిస్తున్నాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కోహ్లీ మైదానంలో అన్ని వైపులా షాట్లు కొడుతూ అభిమానుల‌ను అల‌రిస్తాడ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సచిన్ కంటే కోహ్లీకి చాలా టెంపర్ మెంట్ ఉంద‌ని ఆయ‌న అన్నారు. కోహ్లీ ప్ర‌పంచంలోని అంద‌రు ఆట‌గాళ్ల‌లోకి బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని ఇమ్రాన్ ఖాన్ గతంలో కూడా విరాట్‌ని ప్ర‌శంసించారు.

  • Loading...

More Telugu News